మనువాడాల్సిన వాడినే కటకటాలకు పంపిన ఎస్​ఐ

By udayam on May 6th / 6:38 am IST

గతేడాది నిశ్చితార్ధం చేసుకున్న వ్యక్తినే ఓ లేడీ ఎస్​ఐ అరెస్ట్​ చేసిన ఉదంతం అస్సాంలో జరిగింది. నాగాన్​లో ఎస్​ఐగా పనిచేస్తున్న జున్మోనికి గతేడాది అక్టోబర్​లో రాణా పొగాగ్​ అనే వ్యక్తితో నిశ్చితార్ధమైంది. ఈ ఏడాది నవంబర్​లో వీరి వివాహం జరగాల్సి ఉండగా.. ఆమె పనిచేస్తున్న స్టేషన్​లోనే పొగాగ్​పై కేసు నమోదైంది. ఓఎన్జీసీలో ఉద్యోగాలిప్పిస్తామని చెబుతూ కోట్ల రూపాయలు దోచుకున్నాడని తెలుసుకున్న జున్మోని.. రాణా పొగాగ్​ ను అరెస్ట్​ చేసి కటకటాల వెనక్కి నెట్టింది.

ట్యాగ్స్​