కొత్త కరోనాపై మా వ్యాక్సిన్​ పనిచేస్తుంది

ఆస్ట్రాజెనెకా ఆశాభావం

By udayam on December 24th / 7:10 am IST

బ్రిటన్​లో కొత్తగా బయటపడిన కరోనా వ్యాక్సిన్​పై తాము ఇదివరకే సిద్ధం చేసిన వ్యాక్సిన్​ పనిచేస్తుందని ఆస్ట్రాజెనెకా సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

‘‘ప్రస్తుతం ప్రబలుతున్న కొత్త కరోనా వైరస్​ జెనెటిక్​ కోడ్​లో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే మేం తయారు చేసిన వ్యాక్సిన్​లో సార్స్​–కోవ్​–2 వైరస్​ స్పైక్​ ప్రొటీన్​ను ఉపయోగించాం. దాని వల్ల కొత్త కరోనా వైరస్​ జెనెటిక్​ కోడ్​లో మార్పులు జరిగినా దాని స్పైక్ ప్రోటీన్​ ​లో మార్పులు కనిపించలేదు. కాబట్టి మా వ్యాక్సిన్​ దానిపై కూడా సమర్ధవంతంగా పనిచేయగలదు” అని ఆస్ట్రాజెనెకా వివరించింది.

అయితే దీనిని నిర్ధారించడానికి మేం త్వరలోనే మరిన్ని పరీక్షలు చేయనున్నామని, వాటి ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.