భూమికి చేరుకున్న రాజాచారి

By udayam on May 7th / 4:17 am IST

భారతీయ అమెరికన్​ వ్యోమగామి రాజాచారి 6 నెలల అంతరిక్షయానాన్ని పూర్తి చేసుకుని భూమికి తిరిగొచ్చాడు. అతడితో పాటు శుక్రవారం మొత్తం నలుగురు ఆస్ట్రోనాట్లు గల్ఫ్​ ఆఫ్​ మెక్సికోలో సేఫ్​ ల్యాండ్​ అయ్యారు. స్పేస్​ఎక్స్​ డ్రాగన్​ షిప్​లో అమెరికా కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 12.43 గంటలకు వారు తమ 177 రోజుల అంతరిక్ష యానాన్ని ముగించుకుని క్షేమంగా తిరిగొచ్చారు. రాజాతో పాటు కాయ్​లా బారన్​, టామ్​ మర్ష్​బర్న్​, మతియాస్​ మౌరర్​లు భూమికి తిరిగొచ్చిన వారిలో ఉన్నారు.

ట్యాగ్స్​