మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన బిజెపి దేశాన్ని నిట్ట నిలువునా చీల్చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా మండిపడ్డారు. మైనారిటీలను దేశవ్యాప్తంగా క్రూరంగా అణచివేస్తున్నారన్న ఆమె.. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఆర్ధిక దాడులు చేయిస్తోందన్నారు. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆమె నిరంతరం భయపెట్టడం, దేశ ప్రజలకు అభద్రత కల్పించడమే బిజెపి సాధించిన లక్ష్యాలని దుయ్యబట్టారు.