మలేషియా పార్లమెంట్​ రద్దు

దేశ వ్యాప్తంగా ఎమెర్జెన్సీ విధించిన ప్రభుత్వం

కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి లాక్​డౌన్​

By udayam on January 12th / 9:09 am IST

మలేషియాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశంలో జాతీయ అత్యవసర స్థితిని విధించిన ప్రభుత్వం అక్కడి పార్లమెంట్​ను రద్దు చేసింది.

దీంతో పాటు దేశవ్యాప్తంగా కఠినమైన లాక్​డౌన్​ను సైతం అమలులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాయల్​ ప్యాలెస్​ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఎమెర్జెన్సీ ఎప్పటి వరకూ?

ప్రధాని ముహుయుద్దీన్​ యాసిన్​.. ఆ దేశ రాజుతో చర్చలు జరిపిన అనంతరం దేశవ్యాప్తంగా ఆగస్ట్​ 1 వరకూ ఎమెర్జెన్సీ అమలులో ఉంటుందని ప్రకటించారు.

పార్లమెంట్​ రద్దు!

దీంతో పాటు దేశ పార్లమెంట్​తో పాటు రాష్ట్రాల చెందిన చట్టసభలను సైతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎమెర్జెన్సీ ఎందుకు?

దేశవ్యాప్తంగా ఆసుపత్రులు కరోనా పేషెంట్లతో నిండిపోయిన కారణంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లాక్​డౌన్​ ఎంతకాలం?

జనవరి 26 వరకూ అంటే రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా కఠినమైన లాక్​డౌన్​ అమలులోకి ఉంటుందని అక్కడి పాలక వర్గం వెల్లడించింది.