కాంగో రాజధాని కిన్షాషాను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించడం, కొండచరియలు విరిగిపడడంతో మంగళవారం వందమంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని అధికారులు తెలిపారు. 1.20 కోట్ల మంది నివసించే ఈ నగరంలో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం గాలింపు మ్మురంగా జరుగుతోందని ఆ దేశ ప్రధాని జేన్ మఖెల్ సామా వెల్లడించారు. నాగలెమా ప్రాంతంలో దాదాపు 40మంది చనిపోయారని ఆ ప్రాంత మేయర్ తెలిపారు.