మెక్సికోలోని రెండు బార్లలో జరిగిన గన్ఫైర్లో 11 మంది దుర్మరణం చెందారు. ఈ దేశంలోని కెలాయా నగరంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో 10 మంది స్పాట్లోనే మరణించారని, ఒకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారని చెప్పారు. ఆయుధాలు ధరించిన 15 మంది బార్లలోకి చొచ్చుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోనే ఈ మారణహోమం చోటు చేసుకుందని తేల్చారు. రెండు డ్రగ్ ముఠాల మధ్య చెలరేగిన గొడవల్లోనే ఈ కాల్పులు జరిగినట్లు వెల్లడించారు.