పెరూ నిరసనల్లో 17 మంది మృతి

By udayam on January 11th / 7:23 am IST

ఆగ్నేయ పెరూలోని జులియాకా విమానాశ్రయం సమీపంలో సోమవారం జరిగిన ఘర్షణల్లో సుమారు 17 మంది మరణించారు. పెరూ అధ్యక్షుడు డినా బోలువార్టే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకారులు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అక్కడి అధికారులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల్లో 17 మంది మరణించగా, 64 మందికి గాయాలైనట్లు స్థానిక అధికారిక కార్యాలయం తెలిపింది. మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో అరెస్ట్‌ అనంతరం గతేడాది డిసెంబర్‌ నుండి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ట్యాగ్స్​