ఇండోనేషియాలో భూకంపం.. 20 మంది మృతి

By udayam on November 21st / 9:22 am IST

ద్వీప దేశం ఇండోనేషియాలో ఈరోజు మధ్యాహ్నం భూకంపం సంభవించింది. 5.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 20మంది మరణించగా.. 300 మందికి గాయాలయ్యాయి. ఇండోనేషియా మెయిన్​ లాండ్​ జావా లో సోమవారం మధ్యాహ్నం కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంపకేంద్రం సియాంజుర్​ కు ఈశాన్యంగా 75 కి.మీ.ల దూరంలో భూమికి 10 కి.మీ.ల లోతున ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ భూకంపం ధాటికి సునామీ వచ్చే ప్రమాదాలు లేవని వెల్లడించారు.

ట్యాగ్స్​