తక్షణమే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ, పెరూ అధ్యక్షురాలు దినా బొలుర్ట్‌కు వ్యతిరేకంగా గత వారం రోజులుగా కొనసాగుతున్న నిరసనల్లో 25మంది మరణించారని పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. మొత్తంగా ఆరు ప్రాంతాల్లో 25మంది చనిపోయారని అధికారిక డేటా పేర్కొంటోంది. మరో 287మంది గాయపడ్డారని, వారు ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. మరో 69మంది ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.