బోటు తిరగబడి 26 మంది మృతి

By udayam on May 3rd / 11:27 am IST

బంగ్లాదేశ్​లోని పద్మా నదిలో 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ స్పీడ్​ బోట్​ ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్​ షిప్​ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోగా 5 గురు గాయాలతో బయటపడ్డారు. మిగతా 5 గురి కోసం కోస్ట్​గార్డ్​ సిబ్బంది వెతుకుతున్నారు. చనిపోయిన వారిలో 25 మంది మగవారు కాగా ఒకరు మహిళ. దేశంలో కరోనా లాక్​డౌన్ అమలులో ఉండగా వీరంతా నిబంధనల్ని అతిక్రమించి ఇలా వ్యవహరించారని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​