లోయలో పడ్డ బస్సు.. 28 మంది మృతి

By udayam on October 13th / 4:54 am IST

వాయువ్య నేపాల్​లోని ముగు ప్రాంతంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైర్​ పేలడంతో అది లోయలోకి జారిపోయింది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా, డజనుకు పైగా గాయపడ్డారు. బస్సు ముందు టైర్లలో ఒకదానికి పంక్చర్​ కావడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. నేపాల్​లో జరుగుతున్న దషైన్​ (మన దేశంలో దసరా) వేడుకల కోసం వీరంతా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​