భారత్​, పాక్​ ఉద్రిక్తతలు: లెస్టర్​లో 47 మంది అరెస్ట్​

By udayam on September 20th / 12:27 pm IST

యూకేలోని లెస్టర్‌లో చోటు చేసుకున్న హిందూ ముస్లిం ఉద్రిక్తతలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 47 మందిని అరెస్టు చేసారు. లెస్టర్‌లో శనివారం రాత్రి కొంత మంది చేసిన నినాదాలతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లెస్టర్‌కు చెందిన 20ఏళ్ల వ్యక్తి దగ్గర హానికారకమైన ఆయుధం ఉన్నట్లు అంగీకరించడంతో 10 నెలల జైలు శిక్ష విధించినట్లు లెస్టర్ పోలీసులు తెలిపారు. గత నెలలో దుబాయ్ లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇక్కడ ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

ట్యాగ్స్​