ఇరాన్​లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం

By udayam on July 2nd / 6:56 am IST

మొన్న ఆఫ్ఘనిస్థాన్​ను కుదిపేసిన భారీ భూకంపం నేడు ఇరాన్​పై విరుచుకుపడింది. శుక్రవారం అర్థరాత్రి 4.6, 4.4 తీవ్రతతోనూ, శనివారం తెల్లవారుఝామున 6.0, 6.3 తీవ్రతతోనూ భూకంపాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు ఈ భూకంపం ధాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 19 మంది గాయపడ్డారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. యునైటెడ్​ అరబ్​ దేశంలోనూ భూకంప ప్రకంపనలు వచ్చాయి. 1990లో ఈ దేశంలో వచ్చిన 7.4 తీవ్రత భూకంపంతో 40 వేల మంది ఇరానీయులు మృతి చెందారు.

ట్యాగ్స్​