అమెరికా : మంచుతుపాను దాడిలో 60 మంది మృతి

By udayam on December 27th / 9:28 am IST

హిమతుపాను ధాటికి దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న అమెరికాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఇప్పటి వరకూ మంచు తుపాను ధాటికి ఆ దేశ వ్యాప్తంగా 6‌‌0 మంది మృతి చెందారు. మంచులో చిక్కుకుపోయిన కార్లలో పలు మృతదేహాలు బయటపడడం కలవరం రేపుతోంది. ఒక్క న్యూయార్క్​ మహానగరంలోనే మంచు తుపాను ధాటికి 27 మంది కన్నుమూశారని అధికారులు వెల్లడించారు. రోడ్లన్నీ కార్లు, బస్సులు, అంబులెన్సులు, ట్రక్కులతో నిండిపోయాయి. వీధులన్నీ మంచులతో నిండిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు, వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. డిసెంబర్​ 31 వరకూ పరిస్థితులు ఇలానే ఉండనున్నాయి.

ట్యాగ్స్​