అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 7 గురు మరణించారని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 2,02,385 మంది ప్రజలు ఉన్న ఇళ్ళను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని తెలిపారు. ఇక్కడి హొజాయి, కచర్ ప్రాంతాలు భారీ వర్షాల ధాటికి అతలాకుతలం అయిపోయాయని తెలిపారు. చరైదో, డర్రాంగ్, ధేమాజి, దిబ్రూగర్, దిమా–హసావో ప్రాంతాలనూ వరదలు పోటెత్తాయని తెలిపారు. మొత్తం 20 జిల్లాల్లోని 652 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయని తెలిపారు.