ఇరాక్‌ పోలీసులపై ఉగ్రదాడి.. 9 మంది పోలీసులు మృతి

By udayam on December 19th / 10:06 am IST

ఇరాక్‌లో ఐఎస్​ ఉగ్రమూక జరిపిన బాంబు దాడిలో 9 మంది పోలీసులు మరణించారు. ఇటీవల కాలంలో ఇరాక్‌లో జరిగిన ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి. తొలుత పోలీసు పెట్రోలింగ్‌పై ఐఎస్‌ ఫైటర్లు పేలుడు పరికరాన్ని పేల్చారు. ఆ తర్వాత మెషిన్ గన్‌లు, హ్యాండ్ గ్రెనేడ్‌లతో వారిపై దాడి జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న ఒక ఐఎస్‌ ఏజెంట్‌ను మట్టుబెట్టినట్లు, మిగిలిన వారికోసం గాలిస్తు్న్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. దాడికి పాల్పడ్డ ఉగ్రమూకపై చర్యలకు ఆదేశించినట్లు ప్రధాని మహ్మద్​ షియా అల్​ సుదానీ తెలిపారు.

ట్యాగ్స్​