ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి వివాహం దాదాపు ఖరారైనట్టే. ఈ నెల 23న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు వివాహ వేడుకలు జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాల ఆధారంగా ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలుసు. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారానికి కూడా వచ్చాయి. కాకపోతే వివాహమే జాప్యమవుతూ వచ్చింది. ఖండాలాలోని (ముంబై సమీప ప్రాంతం) సునీల్ శెట్టి నివాసంలో జరిగే పెళ్లి వేడుకకు ప్రముఖులతో పాటు సన్నిహితులను ఆహ్వానించనున్నారు.