సేవలను విస్తరిస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు ప్రజలకు అవసరమైన ఎటిఎం లను తగ్గించుకుంటున్నాయి బ్యాంకులు. ఆంధ్రప్రదేశ్ లో గతేడాది 10,330 ఎటిఎంలు ఉండగా.. ఈ ఏడాది వాటి సంఖ్య 10,091 కు తగ్గిపోయాయి. నిర్వహణ భారం భరించలేకే వీటిని తగ్గించేస్తున్నట్లు తెలుస్తోంది. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో 9,600 ఎటిఎంలు ఉన్నాయి. అప్పటి నుంచి గతేడాది మార్చి వరకు పెరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చికి 10,187 ఎటిఎంలు ఉండగా, జూన్ నాటికి 10,095 సెప్టెంబర్ నాటికి 10,091 ఉన్నట్లు లెక్క తేలింది.