కొత్త జట్లకు వేలం వచ్చేనెలలో

By udayam on September 14th / 10:55 am IST

ఐపిఎల్​లో ఉన్న ప్రస్తుతం 8 జట్లను 10కి పెంచడానికి బిసిసిఐ పాలకవర్గం త్వరపడుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఐపిఎల్​ నుంచే ఈ కొత్త జట్లను ఆడించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అక్టోబర్​ 17న ఈ రెండు కొత్త జట్ల కోసం వేలాన్ని నిర్వహించనుంది. టి20 ప్రపంచకప్​ మొదలయ్యే రోజునే ఈ సరికొత్త జట్లను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే బిసిసిఐ టెండర్​ ప్రక్రియను ప్రారంభించింది. అహ్మదాబాద్​, లక్నో, పుణె నుంచి కొత్త జట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్​