మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి సైనిక కోర్టు మరో ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. దీంతో ఆమెకు వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష మొత్తం 33 ఏళ్లకు చేరుకున్నది. 2021 ఫిబ్రవరిలో సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ఆంగ్ సాన్ సూకీ హౌజ్ అరెస్టులో ఉన్నారు. అప్పటి నుంచి ఆమె మొత్తం 19 అభియోగాలపై 18 నెలల పాటు విచారణను ఎదుర్కొన్నారు.సూకీపై ఉన్న చివరి అయిదు కేసుల్లో శుక్రవారం విచారణ జరిగింది. ఆమె అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.