తాలిబన్ల కు షాక్​.. ఆఫ్ఘన్​ పర్యటన రద్దు చేసుకున్న ఆసీస్​ బోర్డ్​

By udayam on January 12th / 10:31 am IST

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలు, బాలికల విద్య, ఉపాధిపై అక్కడి తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలకు నిరసనగా ఆ జట్టుతో వన్డే సిరీస్ ను బహిష్కరించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి చివర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా ఆఫ్ఘన్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది.

ట్యాగ్స్​