AUSvsSA: ఆసీస్​ 575 డిక్లేర్డ్.. సఫారీలకు కష్టమే

By udayam on December 28th / 8:41 am IST

సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న 2వ టెస్ట్​ లో ఆతిధ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​ లో 575/8 వద్ద డిక్లేర్డ్​ చేసింది. తొలి ఇన్నింగ్ష్​ లో సఫారీలు 189 పరుగులకే ఆలౌట్​ కావడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాకు 386 పరుగుల ఆధిక్యం లభించింది. మరో ఇన్నింగ్స్​ ఆడకుండానే ఆసీస్​ ఈ టెస్ట్​ లో విజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆసీస్​ ఇన్నింగ్స్​ లో డేవిడ్​ వార్నర్​ 200, అలెక్స్​ కేరీ (కెరీర్లో నే తొలి సెంచరీ) 111, స్టీవ్​ స్మిత్​ 85, ట్రావిస్​ హెడ్​ 51, కేమరూన్​ గ్రీన్​ 51 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్​ మొదలెట్టిన సౌతాఫ్రికా 7 ఓవర్లలో 15 పరుగులు చేసి 1 వికెట్​ కోల్పోయింది.

ట్యాగ్స్​