రండి మా దేశంలో టెస్ట్​ ఆడండి: భారత్​, పాక్​ లకు ఆసీస్​ ఆఫర్​

By udayam on December 29th / 11:13 am IST

ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన టి20 వరల్డ్​ కప్​ లో భారత్​, పాకిస్థాన్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ కు వచ్చిన రెస్పాన్స్​ చూసి ఆసీస్​ కొత్త ప్రతిపాదన చేసింది. దాయాది దేశాల మధ్య టెస్ట్ సిరీస్​ కు తాము ఆతిధ్యం ఇస్తామని ఆఫర్​ చేసింది. ఈ మేరకు విక్టోరియా ప్రభుత్వం.. క్రికెట్​ ఆస్ట్రేలియాతో జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. మెల్​ బోర్న్​ క్రికెట్​ మైదానంలో 90 వేల మంది పట్టే స్టేడియంలో ఈ మ్యాచ్​ ను నిర్వహిస్తామని ఆస్ట్రేలియా చెప్పుకొచ్చింది. దీనిపై భారత్​, పాక్​ క్రికెట్​ బోర్డ్​ ల నుంచి ఎలాంటి రెస్పాన్స్​ రాలేదు.

ట్యాగ్స్​