సౌతాఫ్రికా చిత్తు.. ఆసీస్​ దే టెస్ట్​ సిరీస్​

By udayam on December 29th / 11:01 am IST

సఫారీ జట్టుతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్​ సిరీస్​ ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే దక్కించుకుంది. రెండో టెస్ట్​ రెండో ఇన్సింగ్​ లో సౌతా ఫ్రికా జట్టు కేవలం 204 పరుగులకే ఆలౌట్​ కావడంతో ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్​ 182 పరుగుల విజయం దక్కింది. మొదటి ఇన్నింగ్స్​ లో సఫారీలు 189 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 575 పరుగులకు డిక్లేర్డ్​ చేసింది. ఆపై సౌతాఫ్రికా టీం 204 పరుగులకు రెండో ఇన్నింగ్స్​ ను నాలుగో రోజే ముగించింది.

ట్యాగ్స్​