ప్రపంచ బాక్సాఫీస్ పై అవతార్–2 సంచలనాలు ఇంకా ఆగకముందే ఈ సిరీస్ లో వచ్చే 3వ పార్ట్ గురించి డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ కొన్ని లీకులు ఇచ్చాడు. వచ్చే పార్ట్ మొత్తం పాండోరాలోని ఎడారి ప్రాంతాల్లో ఉంటుందని, అక్కడి విలువైన ఖనిజాలను ఎత్తుకెళ్ళాలన్న మనుషుల ప్రయత్నాలను జేక్ తన కుటుంబంతో కలిసి ఎలా అడ్డుకున్నాడన్నది చూపించనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీకి ప్రస్తుతం 10 గంటల కట్ ను మేకర్స్ సిజి వర్క్స్ చేయిస్తున్నారు. 2024 డిసెంబర్లో ఈ మూవీ విడుదల కానుంది.