జేమ్స్ కేమరూన్ విజువల్ వండర్ అవతార్–2 భారత్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలై నిన్నటికి 8 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరింది. రెండో శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా రూ.14.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. నిన్న విడుదలైన రోహిత్ శెట్టి, రణ్ వీర్ సింగ్ ల మూవీ ‘సర్కస్’ కు ఫ్లాప్ టాక్ రావడంతో అవతార్–2 కలెక్షన్లు మరో వారం కూడా ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి శుక్రవారం ఉదయం నాటికి రూ.5000 ల కోట్ల కలెక్షన్లు వచ్చాయి.