హైదరాబాద్ సమీపంలో రెండో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కోసం 2030 నాటికి రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ముంబైలో ఇప్పటికే ఒక డేటా సెంటర్‌ను అమెజాన్ వెబ్సర్వీసెస్2016 లో ఏర్పాటు చేసింది. ప్రపంచంలో మొత్తం 30 చోట్ల డేటా సెంటర్ క్లస్టర్లను అమెజాన్ వెబ్ సర్వీసెస్ నెలకొల్పింది. ఈ పెట్టుబడుల ఫలితంగా 48 వేల ఫుల్‌టైమ్ జాబ్స్ క్రియేట్ అవుతాయని అమెజాన్వెబ్ సర్వీసెస్ ఈ ప్రకటనలో తెలిపింది.