అల్​ఖైదీ చీఫ్​ అల్​జవహరీ మృతి

అనారోగ్య కారణాలతోనేనని ప్రకటించిన విదేశీ వార్తా సంస్థలు

By udayam on November 21st / 11:45 am IST

తీవ్రవాద సంస్థ అల్​ ఖైదాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ సంస్థలోని టాప్​ కమాండర్లందరూ అమెరికా దాడుల్లో చనిపోతుండగా.. ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్​ అయమాన్​ అల్​ జవహరి అనారోగ్య కారణాలతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది జరిగి ఇప్పటికే నెల రోజులు గడిచిందని అరబ్​ న్యూస్​ వార్తను ప్రచురించింది.

2001లో 9/11 దాడుల్లో కీలకపాత్ర పోషించిన అల్​ ఖైదాను బిన్​ లాడెన్​తో కలిసి 69 ఏళ్ళ అల్​ జవహరి అల్​ జవహరి 1988లో స్థాపించాడు.

అయితే జవహరిపై ఇప్పటికే తాము వైమానిక దాడి చేశామని, అందులోనే అతడు చనిపోయాడని యుఎస్​, ఫ్రాన్స్​లు ఇంతకు ముందు ప్రకటించాయి.

దీంతో పాటు గతేడాది లాడెన్​ కొడుకు హజ్మా బిన్​ లాడెన్​ను సైతం అమెరికా సైన్యం మట్టుబెట్టినట్లు వైట్​హౌస్​ వెల్లడించింది.

గత వారం న్యూయార్క్​ టైమ్స్​.. అల్​ ఖైదాలో రెండో స్థానంలో ఉన్న అబ్దుల్​ అహ్మద్​ అబ్దుల్లాను సైతం ఇరాన్​లోని టెహ్రాన్​లో ఇజ్రాయెల్​ బలగాలు మట్టుబెట్టినట్లు వార్తను ప్రచురించింది.

అల్​ జవహరి చివరి సారిగా రెండు నెలల క్రితం వీడియోలో కనిపించాడు. అతడి మరణవార్తకు సంబంధించి పలు ఊహాగానాలు వస్తున్నప్పటికీ అల్​ ఖైదా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.