అయోధ్య రామ మందిర నిర్మాణం 2024 నాటికి పూర్తి కాదని రామజన్మభూమి ట్రస్ట్ ట్రెజరర్ గిరిజి మహరాజ్ వెల్లడించారు. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఆలయాన్ని 2023 కల్లా సిద్ధం చేస్తామన్న ప్రకటనకు మహరాజ్ చేసిన ప్రకటన విరుద్ధంగా ఉంది. ఆలయ నిర్మాణంలో కాస్త ఆలస్యం అవుతుందని 2024 ఫిబ్రవరికి కానీ ప్రజలకు అందుబాటులోకి తేలేమని మహరాజ్ తెలిపారు. ‘2024 ఫిబ్రవరిలో రామ్లల్లాను ప్రతిష్టించి భక్తులకు దర్శనం కల్పిస్తాం. ఆపై మరోవైపు ఆలయ నిర్మాణం సాగుతుంది’ అని తెలిపారు.