నంద్యాలలో తిరగబడ్డ శబరిమల బస్సు.. ఏడుగిరికి గాయాలు

By udayam on December 22nd / 5:47 am IST

హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాముల మినీ బస్సు టెంపో ట్రావెలర్ నంద్యాల సమీపంలో ప్రమాదానికి గురైంది. నంద్యాల సమీపంలోని కానాల పల్లె మలుపు దగ్గర ఈ బస్సు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణిస్తుండగా ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని 108 వాహనంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆష్పత్రికి తరలించారు.

ట్యాగ్స్​