విశాఖ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత.. పట్టాలపైకి చేరిన స్వాములు

By udayam on December 15th / 11:43 am IST

విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం అయ్యప్ప స్వాములు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. తాము రిజర్వేషన్​ చేసుకున్న కొల్లం ఎక్స్​ ప్రెస్​ ట్రైన్​ లో ఎస్​ 7, 8, 9 కోచ్​ లు లేవంటూ అధికారులను నిలదీశారు. అనంతరం ట్రైన్​ కదలకుండా 250 మంది స్వాములు పట్టాలపై కూర్చున్నారు. అప్పటికి గానీ చలనం రాని అధికారులు ప్రయాణికులు క్షమాపణలు చెప్పి మూడు కోచ్​ లను కొల్లం ట్రైన్​ కు జత చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​