తనను ప్రేమించి మరొకరిని పెళ్లిచేసుకుందన్న కారణంతో.. ప్రేయసిని అత్యంత దారుణంగా చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో జరిగింది. ఆజంగఢ్ జిల్లాలోని ఇషాఖ్‌పుర్ గ్రామానికి చెందిన ఆరాధాన అనే యువతిని.. అదే ప్రాంతానికి చెందిన ప్రిన్స్ యాదవ్ ప్రేమించాడు. ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నాక.. ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆరాధన ఈ ఏడాది ఆరంభంలో మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ప్రిన్స్ ఈ నెల 9న గుడికి తీసుకెళ్తానని ఆమెకు మాయమాటలు చెప్పి.. బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి స్నేహితుల సాయంతో ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఓ పాలిథిన్ బ్యాగ్‌లో వేసి, బావిలో పడేశాడు.