తల్లి అయిన బబితా ఫోగట్​

By udayam on January 12th / 6:23 am IST

భారత రెజ్లర్లు, రాజకీయ నాయకురాలు బబితా ఫోగట్​, వివేక్​ సుహాగ్​ దంపతులు నిన్న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

చిన్నారి ఫొటోను షేర్​ చేసిన దంపతులు దానికి ‘‘మా చిన్నారి సన్​షైన్​ను చూడండి’’ అంటూ కామెంట్​ జత చేశారు.

రెజ్లర్లు అయిన బబితా ఫోగట్​, వివేక్​ సుహాగ్​లు 2019 నవంబర్లో పెళ్ళాడారు. రెజ్లింగ్​తో పాటు రియాలిటీ షో నాచ్​ బలియేలో సైతం వీరిద్దరూ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

బబితా ఫోగట్​ కామన్​ వెల్త్​ గేమ్స్​ మెడల్​ గెలిచిన విషయం తెలిసిందే.