బజాజ్ నుంచి కొత్త పల్సర్ బైక్

By udayam on November 23rd / 11:28 am IST

బజాజ్ ఆటో కొత్త తరం పల్సర్ ‘పీ150’ని భారత మార్కెట్లో విడుదల చేసింది. సింగిల్- డిస్క్ వేరియంట్ ధర రూ.1.16 లక్షలు కాగా, ట్విన్-డిస్క్ వేరియంట్ ధర రూ.1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్). బజాజ్ పల్సర్ పీ150ని కంపెనీ మొదట కోల్‌‌‌‌కతాలో లాంచ్​ చేసింది. రాబోయే వారాల్లో ఇతర నగరాలకు అందుబాటులోకి వస్తుంది. ఇది రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. పీ150లోని 149.68 సీసీ ఇంజన్​ 8,500 ఆర్​పీఎం వద్ద 14.5 పీఎస్​ను ఇస్తుంది.

ట్యాగ్స్​