పఠాన్ ప్రమోషన్లపై బజరంగ్​ దళ్​ దాడులు

By udayam on January 6th / 6:25 am IST

షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంపై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులు చేశారు. అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్‌ ఆల్ఫా వన్ మాల్‌లో ఈ సినిమా ప్రమోషన్‌ వేదిక వద్ద బజరంగ్ దళ్ సభ్యులు వీరంగం చేశారు. షారుఖ్ ఖాన్ ఫోటోలున్న పబ్లిసిటీ బోర్డులను ధ్వంసం చేశారు. ఈ సినిమాను ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ వారు హెచ్చరించారు. పఠాన్ మూవీలోని బేషరం రంగ్ పాట విడుదలైనప్పటి నుంచే దీనిపై వివాదాలు మొదలయ్యాయి. ఈ పాటపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​