బాలయ్యతో “తెలుగు మీడియం”

By udayam on February 21st / 5:56 am IST

హైదరాబాద్ : బాలీవుడ్ లో ఇర్ఫాన్‌ ఖాన్‌, రాధిక మదన్‌, కరీనా కపూర్‌ తదితరులు నటించిన ‘అంగ్రేజీ మీడియం‌’ చిత్రం మంచి సక్సెస్‌ అందుకుంది.

దీన్ని రిమేక్ చేయడంతో పాటు తెలుగు భాష గౌరవం ప్రపంచానికి చాటి చెప్పేలా కథలో మార్పులు చేసి.. నందమూరి బాలయ్యతో ‘తెలుగు మీడియం’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తీయడానికి కొందరు నిర్మాతలు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పక్కా స్క్రిప్ట్ రెడీ చేసి.. బాలయ్యను సంప్రదించాలని నిర్మాతలు భావిస్తున్నారట. బాలయ్య ఇప్పుడు ‘తెలుగు మీడియం’ అంటూ సినిమా చేస్తే.. నిజంగా అది చరిత్రే అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిచేస్తారని అంటున్నారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పోరాడిన నందమూరి తారక రామారావు పేరు ఎలా అయితే చరిత్రలో నిలిచిందో, ఇప్పుడు ఈ టైటిల్‌తో బాలయ్య సినిమా చేసి తెలుగు భాష విశిష్టతను చెప్పే ప్రయత్నం చేస్తే.. తండ్రి గుణగణాలే కాదు, పోరాట పటిమ కూడా అలవడిందనేలా బాలయ్య పేరు మారు మోగుతుందని బాలయ్య ఫాన్స్ నుంచికా వినిపిస్తోంది.