అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ వీర సింహారెడ్డి చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తైన ఈ మూవీ తర్వాత బాలయ్య.. అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి సంబదించిన తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్‌లో షురూ కాబోతుంది. మేకర్స్ ఈ మూవీ కోసం స్పెషల్ జైలు సెట్ వేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఫ్లాష్ బ్యాక్ జైలు ఎపిసోడ్ కోసం ఈ సెట్టు వేస్తున్నట్టు సమాచారం. పెళ్లి సందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించనున్నట్టు సమాచారం.