గోన గన్నారెడ్డిగా బాలయ్య

By udayam on October 28th / 7:11 am IST

నందమూరి బాలకృష్ణ మరోసారి పౌరాణిక పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ఫిలింనగర్​లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక కథలో నటించిన ఆయన మరోసారి ఇలాంటి చారిత్రాత్మక పాత్రలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న చిత్రం పూర్తయ్యాక చారిత్రక వీరుడు గోన గన్నారెడ్డిగా తెరపై కనిపించి అభిమానులను అలరించనున్నారు. ‘గోన గన్నారెడ్డి’ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా తెలియలేదు. గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీకి డైరెక్షన్ చేసిన క్రిష్ ని ఎంచుకుంటారా లేక మరో దర్శకుణ్ణి తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే..