అన్ స్టాపబుల్ సీజన్ 2 : ఫస్ట్​ గెస్ట్ చంద్రబాబు!

By udayam on October 4th / 11:53 am IST

త్వరలో ప్రారంభం కానున్న బాలయ్య బుల్లితెర మెగా షో ‘అన్​స్టాపబుల్​ సీజన్​ –2’ కు తొలి గెస్ట్​గా మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సీజన్​కు సంబంధించిన ట్రైలర్​ను మంగళవారం విడుదల చేయనున్నారు. బాలయ్య షోకు చంద్రబాబు హాజరైన ఫోటోలు లీక్ అవ్వడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. వరుసకు చంద్రబాబు.. బాలయ్యకు బావ అవుతారన్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఎలాంటి ప్రశ్నలు చంద్రబాబును బాలయ్య అడుగుతారన్న దానిపై అటు పార్టీ అభిమానులు, ఇటు సినీ అభిమానులు ఆశక్తితో ఉన్నారు.