రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యానర్స్‌పై జనవరి 26 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ చెప్పారు. ‘ప్రత్యామ్యాయ ప్లాస్టిక్ బ్యానర్స్’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఎపిసిబి) ఏర్పాటు చేసిన వర్క్‌షాష్‌ను బుధవారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నీరబ్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యానర్ల ప్రింటర్లకు ప్రత్యామ్నాయంగా యంత్రాల మార్పునకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.