ఢిల్లీలో బిఎస్​–3, బిఎస్​–4 కార్లపై నిషేధం

By udayam on January 10th / 11:34 am IST

వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి బీఎస్‌3 పెట్రోల్‌, బీఎస్‌4 డీజిల్‌ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించింది. నెమ్మదిగా వీస్తున్న గాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా వాయు నాణ్యత పడిపోవడంతో తగిన చర్యలు తీసుకోవాలని దేశ రాజధాని – ఎన్‌సీఆర్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాలకు వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్‌ సూచించింది. ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టకుండా చర్యలు తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. ఇప్పుడు కాలుష్యకారక వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించింది.

ట్యాగ్స్​