బిజెపి ఎంపి అరవింద్ ఇంటిపై ఈరోజు టిఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పపడంపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మమ్మల్ని, మా నాయకుల్ని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే ధైర్యం లేని టిఆర్ఎస్.. ఇలా భౌతిక దాడులకు దిగుతూ బెదిరించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కినంతమాత్రాన తాము భయపడేది లేదన్న బండి.. మా సహనాన్ని చేతకానితనంగా మాత్రం భావించొద్దన్నారు. తమ పార్టీ కార్యకర్తలు బరిలోకి దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదని సంజయ్ హెచ్చరించారు.