దుమ్మురేపిన పటీదార్​.. లక్నో ఎలిమినేట్​

By udayam on May 25th / 7:07 pm IST

ఐపిఎల్​ ఎలిమినేటర్​ మ్యాచ్​లో బెంగళూరు అదరగొట్టేసింది. ఆ జట్టు ప్లేయర్​ పటిదార్​ (112*) సెంచరీతో కదం తొక్కిన వేళ లక్నో సూపర్​ కింగ్స్​ తుది వరకూ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన బెంగళూరు 207 పరుగుల భారీ స్కోర్​ చేసింది. చివర్లో కార్తీక్​ 37 పరుగులతో రెచ్చిపోయాడు. ఆపై ఛేదనలో లక్నోకు రాహుల్​ 79, దీపక్​ హుడా 45 తో ఆదుకున్నా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 193 పరుగులతో సరిపెట్టుకుంది. బెంగళూరు ఫైనల్​ చేరాలంటే రాజస్థాన్​తో 2వ క్వాలిఫయర్​లో తలపడాల్సి ఉంది.

ట్యాగ్స్​