బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు భారత బౌలర్లు చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. ఆపై బ్యాటింగ్ కు దిగిన బంగ్లాను 44 ఓవర్లలో 133 పరుగులకే 8 వికెట్లు తీసి దెబ్బకొట్టారు. పేసర్ సిరాజ్ 3 టాప్ ఆర్డర్ ను కూల్చేయగా.. కుల్దీప్ 4 వికెట్లతో మిడిలార్డర్ ను చెడుగుడు ఆడుకున్నాడు. బంగ్లా తన ఇన్నింగ్స్ లో తొలి బంతికే వికెట్ ను కోల్పోవడం విశేషం. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 271 పరుగులు వెనుకబడి ఉంది.