150 కే బంగ్లా ఆలౌట్​.. రెండో ఇన్నింగ్స్​ మొదలెట్టిన భారత్​

By udayam on December 16th / 6:09 am IST

బంగ్లాదేశ్​ తో జరుగుతున్న తొలి టెస్ట్​ లో భారత్​ కు 254 పరుగుల తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యం దక్కింది. ఈరోజు 133 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్​ ను మొదలెట్టిన బంగ్లా బ్యాటర్లు మరో 17 పరుగులు జత చేసి చివరి 2 వికెట్లు కోల్పోయారు. కుల్దీప్​ యాదవ్​ 5, సిరాజ్​ 3, ఉమేష్​, అక్షర్​ పటేల్ లు చెరో వికెట్​ తీశారు. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్​ రహీమ్​ చేసిన 28 పరుగులే అత్యధికం. ఇత ఆధిక్యం ఉన్నప్పటికీ భారత్​ బంగ్లాను ఫాలో ఆన్​ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్​ లో బ్యాటింగ్​ కు దిగింది.

ట్యాగ్స్​