టీమిండియాకు పసికూన బంగ్లాదేశ్ భారీ షాకిచ్చింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత భారత్ తో ఓ వన్డే మ్యాచ్ ను గెలుచుకుంది. మన ఫీల్డర్ల చెత్త ప్రదర్శనే ఇందుకు కారణం. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 139 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో చివరి వికెట్ కు బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ (38 నాటౌట్), ముస్తాఫిజుర్ (10 నాటౌట్) సహకారంతో బంగ్లాదేశ్‌కు చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.