మెహదీ హసన్​ వీరోచిత పోరాటం.. బంగ్లా స్కోర్​ 271/7

By udayam on December 7th / 11:03 am IST

భారత్​ తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్​ వీరోచితంగా పోరాడింది. టాస్​ నెగ్గి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆ జట్టు కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై తొలి మ్యాచ్​ హీరో మెహదీ హసన్​ (100) సెంచరీతో చెలరేగిపోయాడు. అతడికి సీనియర్​ బ్యాటర్​ మహ్మదుల్లా (77) తో కలిసి ఇన్నింగ్స్​ ను చక్కదిద్దాడు. దీంతో 7వ వికెట్ కు ఈ జంట ఏకంగా 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత బౌలర్లలో సిరాజ్​ 2, ఉమ్రాన్​ 2, సుందర్​ 3 వికెట్లు తీశారు. మొత్తంగా 5‌‌0 ఓవర్లలో బంగ్లా 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.

ట్యాగ్స్​