విశాఖ నుంచి ఎపి మంత్రుల బస్సు యాత్ర

By udayam on May 19th / 5:11 am IST

ఎపిలో గడపగడపకూ వైఎస్సార్​సిపి కార్యక్రమాన్ని జరుపుతున్న అధికార పార్టీ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులతో ఈ బస్సు యాత్ర ఈనెల 26 నుంచి 29 వరకూ కొనసాగనుంది. విశాఖ నుంచి ప్రారంభమై.. అనంతపురంలో ముగియనున్న ఈ యాత్ర కోసం 2 ప్రత్యేక బస్సులను సైతం సిద్ధం చేశారు. రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల మీదుగా జరగనున్న ఈ బస్సు యాత్రకు రూట్​ మ్యాప్​ సైతం సిద్ధమైంది.

ట్యాగ్స్​