జర్నలిస్ట్​పై 2 ఏళ్ళ బ్యాన్​ విధించిన బిసిసిఐ

By udayam on May 4th / 12:49 pm IST

భారత సీనియర్​ క్రికెటర్​ వృద్ధిమాన్​ సాహా తనకు ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న కోపంతో అతడిపై బెదిరింపులకు దిగిన స్పోర్ట్స్​ జర్నలిస్ట్​ బొరియా మజుందార్​పై బిసిసిఐ రెండేళ్ళ నిషేధం విధించింది. బుధవారం నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయం అప్పట్లో నెట్టింట వైరల్​ కావడంతో రంగంలోకి దిగిన బిసిసిఐ మజుందార్​కు ఇచ్చిన అక్రిడేషన్​ను సైతం రద్దు చేసింది. దీంతో అతడు ఎలాంటి దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల ప్రెస్​మీట్లలో పాల్గొనలేడు.

ట్యాగ్స్​